Header Banner

శ్రీవారి భక్తులకు ఇక నో టెన్షన్! అంతా వాటి పరిధిలోనే..

  Thu May 29, 2025 09:10        Devotional

టీటీడీ వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు స్మార్ట్‌ స్టిక్స్‌ను వినియోగంలోకి తీసుకుంది. ఈ స్టిక్స్‌లో టార్చ్‌, అలారం, కరెంట్‌ షాక్‌ డివైజ్ ఉంటాయి, వాటి ద్వారా వన్యమృగాలను భయపెడుతూ భక్తుల రక్షణ జరుగుతుంది.

 

చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగుల వంటి వన్యప్రాణుల నుంచి శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ స్మార్ట్‌ స్టిక్స్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే 20 ‘స్మార్ట్‌ స్టిక్స్‌’ను కొనుగోలు చేశారు.

 

 ఇది కూడా చదవండి: అమరావతికి మరో ఇన్నర్ రింగ్ రోడ్డు రూ. 48 కోట్లతో..! ఈ రూట్‌లోనే, పనులు ప్రారంభం!

 

స్మార్ట్‌ స్టిక్స్‌ ప్రత్యేకత ఏమిటి..?

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ స్టిక్స్‌ను టీటీడీ ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్నారు. నడక మార్గాల్లో వచ్చే భక్తులతో పాటు వచ్చే సెక్యూరిటీ, ఫారెస్ట్‌ సిబ్బంది వాడే ఈ స్మార్ట్‌ స్టిక్స్‌లో ఎక్కువ కాంతి వచ్చేలా టార్చ్‌, అలారం ఉంటాయి. వీటితోపాటు కింద భాగంలో కరెంటు షాక్‌ ఇచ్చే డివైజ్‌ను ఏర్పాటు చేశారు. వన్యమృగాలు చేరువగా వచ్చినప్పుడు ఈ స్మార్ట్‌స్టిక్స్‌లో ఉన్న అలారం మోగించవచ్చు. అయినా దగ్గరకు వస్తే స్టిక్‌లోని డివైజ్‌ను యాక్టివేట్‌ చేసి వాటికి కరెంట్‌ షాక్‌ ఇవ్వగానే భయంతో పారిపోతాయి. చిరుతల సంచారం పెరిగిన నేపథ్యంలో మరో 20 స్మార్ట్‌ స్టిక్స్‌ను కొనుగోలు చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం ఫారెస్ట్‌ అధికారులను ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #LordVenkateswara #TirupatiDarshan #SrivariBlessings #DevoteeRelief #NoMoreTension